నిజంనిప్పులాంటిది

Apr 15 2024, 08:34

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు.

పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు.

ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్‌ను రాజయ్య ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్‌ సూచించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లా డుతూ.. కడియం శ్రీహరిపై అనర్హత వేటు ఖాయమన్నారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మె ల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని రాజయ్యకు కేసీఆర్‌ సూచించారు..

నిజంనిప్పులాంటిది

Apr 15 2024, 08:32

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ మేధావి,రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రాష్ట్రవ్యాప్తం గా విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తం గా పోటీ పరీక్షల్లో వారి ప్రావిణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

ఎన్నికల నియమావళి అనుసరించి ఆలస్యం జరుగుతున్నదన్నారు. హైదరాబాద్ నుండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లకు వీడియోలు, ఆడియోల ద్వారా కోచింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయా లనే ఆలోచన చేస్తున్నామ న్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున విద్యను అందిం చాలనే ఆలోచన మేరకు ఈ నాలెడ్జ్ సెంటర్లను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.

కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాయన్నారు.గత పది సంవత్సరాలపాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

రాజ్యాంగ స్ఫూర్తితో,అంబే ద్కర్ ఆశయాలకు అనుగు ణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కోన్నారు.రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రంలో నవసమాజం, సమాన త్వంతో పరిపాలనలో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Apr 15 2024, 08:29

ముంబై పై CSK ఘన విజయం

ఐపిఎల్‌లో భాగంగా ఆది వారం ముంబై ఇండియ న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ సీజన్‌లో చెన్నైకి ఇది నాలుగో విజయం కావడం విశేషం. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించిన ముంబైకి ఈసారి ఓటమి తప్ప లేదు.తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరు గులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం సాధిం చినా ఫలితం లేకుండా పోయింది.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్‌లు శుభారంభం అందించారు.

ధాటిగా ఆడిన ఇషాన్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యా డు. అయితే తిలక్‌వర్మ (31)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు.

అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఒంటరి పోరాటం చేసిన రోహిత్ 63 బంతుల్లోనే 5 సిక్సర్లు, 11 ఫోర్లతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో టి20 కెరీర్‌లో 500 సిక్సర్లు కొట్టి నయా చరిత్ర సృష్టించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను రుతురాజ్ (69), శివమ్ దూబె 66 నాటౌట్ ఆదుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 14 2024, 21:43

'ఫోన్‌ రిపేరుకు ఇచ్చి.. పోలీసులకు చిక్కి'.. ఎన్‌ఐఏ కస్టడీలో బెంగళూరు బ్లాస్ట్‌ నిందితులు!

బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (NIA) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే..

అయితే, మార్చి 1న చోటుచేసుకున్న ఆ ఘటన అనంతరం పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో 35 సిమ్‌లు, ఫేక్‌ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరకు ఓ సెల్‌ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం.

కోల్‌కతాలో అరెస్టైన ముసావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహాలను ఎన్‌ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తోంది. దాడి తర్వాత ఈ ఇద్దరు నిందితులు అనేక రాష్ట్రాలు తిరుగుతూ చివరకు పశ్చిమ బెంగాల్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో అనేక హోటళ్లలో తలదాచుకున్నారు. సెల్‌ఫోన్లను తరచూ మార్చిన నిందితులు దాదాపు 35 సిమ్‌ కార్డులు వాడారు. కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌ ప్రాంతంలోని కొన్నిరోజులు బసచేశారు. ఈ క్రమంలో ఓ నిందితుడి సెల్‌ఫోన్‌లో సమస్య తలెత్తింది. దాంతో అక్కడి చాంద్‌నీ చౌక్‌ మార్కెట్లోని ఓ దుకాణంలో రిపేర్‌కు ఇచ్చారు. ఫోన్‌లో మాత్రం సిమ్‌కార్డులు లేవు.

మైక్రోఫోన్‌లో ఏదైనా సమస్య ఉందా?అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని.. అతడి దగ్గరున్న ఓ సిమ్‌ కార్డును అందులో పెట్టి చూశాడు. అదే నిందితులను పట్టించేందుకు మార్గం చూపింది. ఆ సాయంత్రం నిందితుడు వచ్చి ఫోన్‌ అడిగినప్పటికీ.. ఇంకా రిపేర్‌ కాలేదని, మరుసటి రోజు రావాలని చెప్పడంతో వెనుదిరిగి పోయాడు.

అప్పటికే నిందుతుల ఫోన్‌ను ట్రాక్‌ చేస్తున్న పోలీసులు.. ఆ మొబైల్‌లో వేసిన సిమ్‌కార్డు సిగ్నల్స్‌తో అప్రమత్తమయ్యారు. ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఫోన్‌ ఆచూకీ కనుగొన్నారు. మొబైల్‌ షాప్‌నకు చేరుకున్న దర్యాప్తు అధికారులు.. యజమాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. అందులో ఒకరు పెట్టుకున్న క్యాప్‌ కూడా వారి ఆచూకీ గుర్తించేందుకు దోహదపడినట్లు తెలిసింది. చివరకు కోల్‌కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 14 2024, 13:21

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు.. వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు..

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితో కేసీఆర్‌ లక్షలాది మందిని సమీకరించి 14 ఏళ్లు తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు.

రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటి నుంచి బయటకు వచ్చిన లక్షల మంది ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని తెలిపారు..

''హైదరాబాద్‌లో 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అది విగ్రహం కాదు విప్లవం అనే మాట కేసీఆర్ చెప్పారు. సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టాం. మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేడ్కర్‌.

బడుగు బలహీన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా.. అవన్నీ ఆయన ఆలోచన నుంచి వచ్చినవే. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి'' అని కేటీఆర్‌ అన్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 14 2024, 13:17

Elections 2024: జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission ) స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది..

మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు.

నిన్న సీఎం జగన్ విజయవాడలో చేపట్టిన బస్సు యాత్రలో ఆయనపై రాయి దాడి జరిగింది. దీంతో ముఖ్యమంత్రి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. దీంతో సీఎంకు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం కొనసాగించారు. జగన్‌ నుదుటికు రెండు కుట్లు పడ్డాయని, గాయం పెద్ద తీవ్రమైనది కాదని, ప్రమాదం ఏమీ లేకపోయినా వాపు మాత్రం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.

Iసీఎంపై దాడి ఘటనతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భద్రతపై పలువురు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీతో పాటు సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 14 2024, 12:30

సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్..

పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాం..

70 ఏళ్ల లోపు అందరికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు..

ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుంది..

ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు..

పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి సబ్సిడీ ధరకు గ్యాస్ అందిస్తాం..

మహిళలను లక్షాధికారులను చేయడమే మా లక్ష్యం. -ప్రధాని మోడీ

నిజంనిప్పులాంటిది

Apr 14 2024, 08:08

Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు దీక్ష

కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆదివారం దీక్ష (Initiation) చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు..

మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ (Parliament) ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) జారీ అయి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటున్నది. రెండు రోజులుగా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ (Congress vs BJP)గా మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ (Bandi Sanjay Kumar) ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తిచేసుకున్నా విభజన హామీలను విస్మరించిందని, దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో దీక్ష చేపడతానని పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు దీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావడం రాజకీయ కలకలాన్ని సృష్టిస్తున్నది.

పరస్పర ఆరోపణలు..

విభజన హామీలను విస్మరించిన బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని, ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని పొన్నం ప్రభాకర్‌ విమర్శిస్తున్నారు. గడిచిన పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్నారని ఆయన విమర్శించారు.

రాముడి ఫొటోలు, అక్షింతలు ఇంటింటికి పంపడం మినహా ప్రతి ఇంటికి ఏమి చేశారో చెప్పాలని, బీజేపీకి చేతనైతే రాముడి బొమ్మతో కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ తమతమ నియోజకవర్గాల్లో ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు..

నిజంనిప్పులాంటిది

Apr 13 2024, 06:18

MLC Kavitha: కస్టడీలో ఉన్న కవితకు కొన్ని వెసులుబాట్లు.. అవేంటంటే..

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది.

న్యాయవాది మోహిత్ రావు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీ రామారావు (కేటీఆర్), పీఏ శరత్‌చంద్రలకు అనుమతి లభించింది. వీరితో పాటు ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు విద్యానిధి పరాంకుశానికి సైతం అనుమతి ఇచ్చింది. న్యాయవాది, కుటుంబ సభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు అక్కడ లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది.

కస్టడీలో ఉన్న సమయంలో కవితకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినేందుకు కోర్టు అనుమతిచ్చింది. జపమాల, దుస్తులు, పరుపు, బెడ్‌షీట్లు, టవల్స్, పిల్లోను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కవిత చదువుకోడానికి ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఎలాన్ మస్క్, ది నట్‌మెగ్స్ కర్స్, రెబెలా ఎగెనెస్ట్ ది రాజ్, రోమన్ స్టోరీస్ పుస్తకాలు అనుమతిచ్చింది.

కాగా.. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.

ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని దిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచే మూడు రోజుల పాటు కవితను సీబీఐ విచారించనుంది.

నిజంనిప్పులాంటిది